ప్రెగ్నెన్సీ టైమ్ డిప్రెషన్‌ పిల్లల మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?  

సాక్షి లైఫ్ : ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి డిప్రెషన్ కు గురైతే దాని ప్రభావం పుట్టిన బిడ్డలపై తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పిల్లల నిద్రపై తీవ్రంగా డిప్రెషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. పదేళ్ల తర్వాత అలాంటి పిల్లల్లో ముఖ్యంగా ఆడపిల్లల్లో నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఆడపిల్లలకు నిద్రలేమి సమస్య ఉండడం వల్ల వారి  ఎదుగుదలపై ప్రభావం పడుతుందట. యుక్తవయస్సుకు ముందు ఎనిమిది నుంచి పది గంటల నిద్ర లేకపోవడం మానసిక, శారీరక సమస్యలు తెలెత్తే అవకాశం ఉందని అధ్యయనంలో వెల్లడైంది.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు..

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 ఒక కుమార్తెకు తన తల్లి నుంచి పుట్టుకతో కొన్నిలక్షణాలు సంక్రమిస్తాయి. ఇందులో మేధస్సు కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో తల్లిలో డిప్రెషన్ కారణంగా మైటోకాండ్రియా కూడా ప్రభావితమవుతుంది. మైటోకాండ్రియాలో ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్‌లు ఉన్నాయి, వీటిని కుమార్తె తల్లి నుంచి పొందుతుంది. ఇవి మేధస్సు స్థాయిని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


డిప్రెషన్‌తో బాధపడే మహిళల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం తక్కువ అని వారు అంటున్నారు. పలు అధ్యయనాల ఆధారంగా అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్  నివేదిక ప్రకారం, గర్భధారణ సమయంలో కుటుంబంతో ఉండటం వలన స్త్రీకి ఆరోగ్య సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో డిప్రెషన్‌తో బాధపడే మహిళల బిడ్డలు ఉన్నత చదువులు చదివే అవకాశం తక్కువ. అలాంటి మహిళల్లో 20శాతం మంది పిల్లలు మాత్రమే ఉన్నత విద్య పొందగలుగుతున్నారు. 85 శాతం మంది మహిళలు గర్భధారణ సమయంలో తమ కుటుంబంతో ఉన్నప్పుడు మానసికంగా దృఢంగా ఉంటారు. అమెరికాలో ఒంటరి మహిళల కంటే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చే కుటుంబంతో నివసిస్తున్న మహిళల శాతం ఎక్కువ. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటేనే పుట్టబోయే పిల్లలు మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉంటారు.  

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression pregnancy-time pregnant-women newborn-babies pregnant-women-health memory-power pregnancy-care-tips diet-and-depression depression-and-exercise depression-treatment how-to-overcome-depression treat-depression-naturally

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com