టూత్ పేస్ట్ కారణంగా చిన్నారుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు..  

సాక్షి లైఫ్ : సాధారణంగా తాగునీటిలో ఫ్లోరైడ్ స్థాయిలు సిఫారసు చేసిన పరిమాణం కంటే ఎక్కువ అయితే , అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజాధ్యయనం వెల్లడించింది. ఒకవేళ ఫ్లోరైడ్ లెవెల్స్ పెరిగితే తీవ్రమైన డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలెటల్ ఫ్లోరోసిస్, బలహీనమైన ఎముకలతో సహా దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..మంకీపాక్స్‌ కేసుల నివారణకు హైదరాబాద్ లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ విషయంలో ముఖంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యానికి హాని కలిగించే 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌ను నిషేధించిన కేంద్ర ఆరోగ్య శాఖ

 తాగునీటిలో అధిక ఫ్లోరైడ్ స్థాయిలు పిల్లల తెలివితేటలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది యూఎస్ ప్రభుత్వ నివేదిక. లీటరుకు 1.5 మి.గ్రా. కంటే ఎక్కువ ఫ్లోరైడ్ తీసుకున్న చిన్నారులలో ఐక్యూ లెవల్స్  తక్కువగా కనిపించినట్లు నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతం, దంతాల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కావిటీస్ (పుచ్చు దంతాలు) నుంచి రక్షించడానికి తాగునీటిలో ఫ్లోరైడ్ యాడ్ చేయడం సాధారణమైన ప్రక్రియ. దీనిని ప్రజారోగ్య సాధనంగా పరిగణిస్తారు. అదేవిధంగా, టూత్ పేస్టులో కూడా ఫ్లోరైడ్ ఉపయోగించడం వల్ల ఫ్లోరైడ్ స్థాయిలు పెరిగి పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడవచ్చు అని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలపై ఫ్లోరైడ్ ప్రభావాలను అధ్యయనం చేశారు ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఫ్లోరైడ్ స్థాయిలను కంట్రోల్ చేయడం, ఆరోగ్య సమస్యలను తగ్గించడం, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం మెరుగైన సూచనలు అవసరమని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎంత త్వరగా నడక ప్రారంభించవచ్చు..?

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health harmful-to-health kids-health-care dental-problems effect-mind pregnant-women side-effects oral-health toothpaste polytetrafluoroethylene oral-cavity-cancer toothpaste-health-risks fluoride-toxicity fluoride-overexposure toothpaste-concerns health-risks-of-fluoride fluoride-effects iq

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com