Hypoxia : ఆక్సిజన్ లేమితో క్యాన్సర్ కణాలకు రెక్కలు..! ఐఐటీ బాంబే సంచలన పరిశోధన.. 

సాక్షి లైఫ్ : ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటైన పాంక్రియాటిక్ క్యాన్సర్ (Pancreatic Cancer) గురించి ఐఐటీ బాంబే (IIT Bombay) పరిశోధకులు కీలక అంశాలను గుర్తించారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండడాన్నే (Hypoxia)గా భావిస్తారు, ఈ సమయంలో క్యాన్సర్ కణాలు తమ పొరలలోని కొవ్వు పదార్థాలను (Membrane Lipids) మార్చుకొని, మెరుగైన కదలిక శక్తిని పొందుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన క్యాన్సర్ మెటాస్టాసిస్ అంటే ఒక చోటు నుంచి మరో చోటుకు వ్యాపించడం, దీని నివారణకు కొత్త మార్గాలను సూచించే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

 

ఆక్సిజన్ లేమికారణంగానే  క్యాన్సర్‌..  

పాంక్రియాటిక్ క్యాన్సర్ కణితిలో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని హైపాక్సియా (Hypoxia) అంటారు. ఆక్సిజన్ లేమి కారణంగా క్యాన్సర్ కణాలు చనిపోవాల్సింది పోయి, మరింత ప్రమాదకరంగా మారుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
  
కొవ్వు పదార్థాల మార్పు (Lipid Remodelling).. 

 హైపాక్సియా పరిస్థితుల్లో, పాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలు తమ చుట్టూ ఉన్న కణ పొర (Cell Membrane)లోని కొవ్వు పదార్థాల కూర్పును భారీగా మార్చుకుంటాయని, ఈ లిపిడ్ల మార్పుల వల్ల కణ పొర బిగుతు (Stiffness) తగ్గి, కణాలు సులువుగా కదిలేందుకు వీలవుతుంది. దీని కారణంగా క్యాన్సర్ కణాలు తమ ప్రాథమిక స్థానం (Primary Tumour) నుంచి విడిపోయి, శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపిస్తాయని ఐఐటీ బాంబే కెమిస్ట్రీ విభాగంలోని పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

పాంక్రియాటిక్ క్యాన్సర్ అత్యంత దూకుడుగా (Aggressive) ఉండటానికి, వేగంగా వ్యాప్తి చెందడానికి ఈ హైపాక్సియా ప్రేరిత కొవ్వు పదార్థాల మార్పు ముఖ్య కారణంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పాంక్రియాటిక్ క్యాన్సర్ కణితుల్లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని, ఇది వ్యాధి మరింత ప్రమాదకరంగా మారడానికి దారితీస్తుందని వైద్యనిపుణులు తెలిపారు.

భవిష్యత్తు చికిత్సలకు ఆధారం.. 

ఈ పరిశోధన ఫలితాలు పాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సకు కొత్త లక్ష్యాలను (Targets) అందిస్తున్నాయి. క్యాన్సర్ కణాల పొరలోని ఈ కొవ్వు పదార్థాల మార్పు ప్రక్రియను నిరోధించడం ద్వారా, వాటి కదలికను ఆపవచ్చు. దీనివల్ల క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.

ఈ అధ్యయనం మెటాస్టాసిస్ నివారణకు ఉద్దేశించిన కొత్త మందుల (Membrane-centric therapeutic interventions) తయారీకి దోహదపడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత చికిత్సలకు లొంగని పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి ఐఐటీ బాంబే చేసిన ఈ పరిశోధన ఒక కీలకమైన ముందడుగుగా పరిగణించవచ్చు.

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : oxygen lipid-profile pancreatic-cancer oxygen-levels blood-oxygen-level low-oxygen-levels high-levels-of-oxygen-effects increase-oxygen-level iit-bombay hypoxia cancer-metastasis iit-bombay-study lipid-rewiring-in-cancer
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com